హర్యానాలో బీజేపీ గెలుపు... కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

12-10-2024 Sat 12:59 | National
Advertisement
  • హర్యానాలో బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించిన అసదుద్దీన్
  • అక్కడ మజ్లిస్ లేకుండా కాంగ్రెస్ ఓడిపోయిందని వ్యాఖ్య
  • విపక్షాలన్నింటినీ కలుపుకొని పోతేనే మోదీని ఓడించగలమన్న అసద్
  • మూసీ పేరుతో రేవంత్ రెడ్డి మా వెంటే పడుతున్నారని ఆగ్రహం
Advertisement
తాము బీజేపీకి 'బీ' టీమ్ అని కాంగ్రెస్ విమర్శిస్తుంటుందని, మరి హర్యానాలో మజ్లిస్ పార్టీ లేకున్నప్పటికీ కమలం పార్టీ ఎలా గెలిచిందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. నిన్న రాత్రి వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... హర్యానాలో బీజేపీ ఎందుకు గెలిచింది? కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఏమీ చేయలేదన్నారు.

తాను చెప్పే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్రమోదీని ఓడించాలంటే విపక్షాలు అన్నీ ఏకం కావాలని సూచించారు. అందరినీ కలుపుకొని వెళితేనే మోదీని ఓడించగలుగుతారన్నారు. 

రేవంత్ రెడ్డి మా వెంటే పడుతున్నారు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ... మూసీ అంటూ మా వెంట ఎందుకు పడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మూసీ నది అనంతగిరి అడవుల్లో పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహించి నల్గొండకు వస్తుందని గుర్తు చేశారు. కానీ సీఎం మాత్రం మూసీ పరీవాహక ప్రాంతం అంటూ కేవలం తమ వెంటే పడుతున్నారని హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.

వాస్తవానికి ఆ పార్టీలు బీజేపీ 'బీ' టీమ్: కాంగ్రెస్ నేత

మజ్లిస్ పార్టీ సహా పలు పార్టీలు బీజేపీని విమర్శిస్తుంటాయని కానీ, వాస్తవానికి ఆ పార్టీలు బీజేపీకి 'బీ' టీమ్‌లు అని కాంగ్రెస్ పార్టీ నేత ఉదయ్ రాజ్ ఆరోపించారు. బీజేపీ 'బీ' టీమ్ ఎవరనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీ టీమ్ పార్టీలు అక్కడకు వెళ్లి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తాయని ఆరోపించారు.
Advertisement
HaryanaMIMCongressBJPAsaduddin Owaisi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more